Header Banner

కర్ణాటక హోంమంత్రి మెడికల్ కాలేజీపై ఈడీ దాడులు! రాన్యా వ్యవహారంపై..!

  Wed May 21, 2025 13:49        Politics

బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రాన్యా రావు వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం కీలక చర్యలు చేపట్టారు. కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర చైర్మన్‌గా వ్యవహరిస్తున్న తుమకూరులోని శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ లో సోదాలు జరిపారు. రాన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులకు కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. రాన్యా రావుకు, పరమేశ్వర చైర్మన్‌గా ఉన్న మెడికల్ కాలేజీకి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. దీంతో, అధికారులు బుధవారం ఉదయం కాలేజీ ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు.

ఆ సమయంలో పరమేశ్వర కాలేజీలో లేరని, తన అనుచరులతో వేరే ప్రాంతంలో సమావేశమయ్యారని తెలిసింది. కాలేజీకి సంబంధించిన ఆర్థిక రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు రాన్యా రావును బంగారంతో పట్టుకున్న విషయం తెలిసిందే. ఆమె ఫోన్‌లో పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల కాంటాక్ట్ నంబర్లు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, రాన్యా రావు వివాహానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వర హాజరైన ఫోటో బయటకు రావడంతో బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ ఆరోపణలను "రాజకీయ కుట్ర"గా కొట్టిపారేశారు.

ఇది కూడా చదవండి: ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ఇకపై నో టెన్షన్..! విమానాల తరహాలో బస్సుల్లో కూడా..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

ఎవ్వరూ మాట్లాడొద్దు..! లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #karnataka #homeninister #ed #rides